![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -417 లో.. ఆదర్శ్ ప్రొద్దున్నే లేచి హాల్లో కూర్చొని రేవతి ని వాటర్ తీసుకొని రమ్మని చెప్తాడు. రేవతి వాటర్ కోసం వెళ్తుంది. ఆదర్శ్ డ్రింక్ చేస్తుంటాడు. వాటర్ తీసుకొని రమ్మని చెప్పింది ఇందుకేనా అంటూ మధు ఆపే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆదర్శ్ ఆగకుండా తాగుతూనే ఉంటాడు. రేవతి వచ్చి ఏంటి దగ్గర ఉండి తాగమని ఎంకరేజ్ చేస్తున్నావా అని మధుతో రేవతితో అనగానే.. ఆదర్శ్ ఏమైనా చిన్న పిల్లాడా దగ్గర వుండి తాగించడానికి అని మధు అంటాడు.
ఆ తర్వాత కృష్ణ, మురారిలు ఇద్దరు తమ గదినుండి హాల్లోకి వచ్చి ఆదర్శ్ ని చూస్తారు. అతడు పొద్దున్నే తాగడం చూసి ఇద్దరు షాక్ అవుతారు. మురారి ఆపే ప్రయత్నం చేసిన ఆదర్శ్ వినకుండా తాగుతూనే ఉంటాడు. వేరేవాళ్ళ బాధ పట్టించుకొనే సిచువేషన్ లో నేను లేను.. నా కంటే పెద్ద బాధ ఇక్కడ ఎవరికీ లేదని ఆదర్శ్ అంటాడు. ఆ తర్వాత అప్పుడే భవాని ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ లిఫ్ట్ చెయ్యడానికి రేవతి బయపడుతుంటే.. కృష్ణ లిఫ్ట్ చేసి మాట్లాడండి అని అంటుంది. ఆ ఫోన్ సుమలత లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. సిచువేషన్ అంతా బానే ఉంది కదా అని భవాని అడుగుతుంది. బానే ఉందని సుమలత కంగారుపడుతుంది. ఇంట్లో సిచువేషన్ అంతా భవానికి చెప్పకుండా దాస్తారు. ఆ తర్వాత కృష్ణ, మురారిలు కలిసి ముకుందని వెతకడానికి వెళ్తారు.
ఆ తర్వాత కృష్ణ, మురారిలు ముకుంద వెళ్లిపోవడం గురించి మాట్లాడుకుంటారు. నేను తొందరపడి అందరి ముందుకు లాగానేమో అని కృష్ణ అనగానే.. సహనం కోల్పోయిన వాళ్ళు ఎవరైనా అలాగే చేస్తారని మురారి అంటాడు. ఆ తర్వాత ఆదర్శ్ డ్రింక్ చేస్తు.. ఎప్పుడు నీకు తొండపై డౌట్ ఉండేది కదా.. అక్కడ తొండనే లేదు నీకు ముందు నుండి ముకుందపై డౌట్ ఉంది కదా అని మధుతో ఆదర్శ్ అంటాడు. మరొకవైపు కృష్ణ, మురారి ఇద్దరు టీ తాగుతుంటే.. ఒకతను ట్రైన్ కి ఎదరుగా వెళ్లి ఒక ఆవిడ చనిపోయిందంట అంటు మాట్లాడతాడు. అది విని ముకుంద అనేమో డౌట్ పడి ఒకసారి వెళదామా అని కృష్ణ అంటుంది. ముకుంద అలా చేసే రకం కాదని మురారి అంటాడు. మరొక వైపు ఆదర్శ్ డ్రింక్ చేస్తూ ముకుంద, ఆదర్శ్ ల ఫోటోని కాల్చేస్తాడు. అది చూసిన రేవతి, మధులు ఆపే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |